Friday, March 13, 2026
HomeTrending Newsరేపు విశాఖకు సిఎం జగన్

రేపు విశాఖకు సిఎం జగన్

MILAN-2022: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఆదివారం విశాఖపట్నం నగరంలో పర్యటించనున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్‌ సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్తారు. సాయంత్రం ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌–2022లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular