Wednesday, June 10, 2026
HomeTrending Newsనదుల సంరక్షణతోనే మానవ మనుగడ

నదుల సంరక్షణతోనే మానవ మనుగడ

నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసింది. నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నదులను ఎవరు పట్టించుకోవడం లేదని పర్యవసానంగా అవి వ్యర్ధాలతో నిండి పోతున్నాయన్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్ లో ప్రారంభమైన నదుల పరిరక్షణ పై జాతీయ స్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరైన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ తదిరులు ఉన్నారు. నదుల సంరక్షనపైనే మానవ మానుగడ ఆధారపడి ఉంటుందని, నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ఎన్జీవో లు ఇతర సంస్థలు కూడా పాటు పడాలని మంత్రి పిలుపు ఇచ్చారు.

నదుల సంరక్షణ లేక కలుషితం అవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణ కోసం ఏమీ చేయడం లేదని మంత్రి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేసిందని.. అందుకు సాక్ష్యం గోదావరి నది అన్నారు. 200 కిలోమీటర్ల మేర కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నది నేడు సజీవంగా ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను కలుషితం కాకుండా చర్యలు చేపడుతున్నదని చెప్పారు. అందుకు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతోంది. ఒక్కో గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్ ను ప్రభుత్వం అందించిందని, గ్రామాల్లో పచ్చదనం కోసం నర్సరీ లను పెంచుతున్నామని మంత్రి వివరించారు. దేశంలో ఎక్కడ కూడా గ్రామానికి ఒక నర్సరీ లేదని, తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడ కూడా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ లు లేవు.వీటి ద్వారా పచ్చదనం ఒక్కటే పెరగడం కాదు నదులు కలుషితం కూడా కాకుండా కాపాడగలుగుతున్నామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

8 సంవత్సరాల కాలంలో 3 శాతం పచ్చదనాన్ని పెంచినం అంటే తెలంగాణ ఎంత ముందుచూపుతో వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్ట్ దీన్ని 3 సంవత్సరాల రికార్డ్ సమయంలో నిర్మాణం చేపట్టామని, ప్రాజెక్టులు నిర్మాణం చేయడంతో రాష్ట్రంలో వలసలు పూర్తిగా తగ్గాయని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో పంటలు ఎక్కువ కావడంతో కేంద్రం కొనం అని చేతులు ఎత్తేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.

Also Read : జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular