Sunday, January 19, 2025
HomeTrending Newsసాంఘిక సంక్షేమ శాఖ ఎస్‌వోపి ఆవిష్కరణ

సాంఘిక సంక్షేమ శాఖ ఎస్‌వోపి ఆవిష్కరణ

Ap Cm Unveiled The Standard Operating Procedure Book :

డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాసనసభలోని సిఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ రూపొందించిన ఎస్‌వోపి (స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌), ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మోడల్‌ కంటింజెన్సీ ప్లాన్‌ బుక్‌లెట్‌ సిఎం జగన్ విడుదల చేశారు.

ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటిస్‌ యాక్ట్‌ అమలుకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన బుక్‌లెట్‌ మరింతగా ఉపయోగపడుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. అంతేకాక ఈ చట్టం క్రింద నమోదైన కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా జరగాలని అధికారులకు సూచించారు.

అట్రాసిటీ చట్టం అమలు, పర్యవేక్షణపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని,  పెండింగ్‌ కేసులను కూడా వెంటనే క్లియర్‌ చేయాలని సిఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వెంటనే న్యాయం అందేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు నిర్ణీత కాలవ్యవధిలోగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవడం, వారికి సంబంధించి పరిపాలనా సమస్యలను తొలగించడం, దురాగతాలను నిర్మూలించడం వంటి అంశాలపై ఈ ఎస్‌వోపి బుక్‌లెట్‌ విడుదల చేశారు

ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, రక్షణ, వారి అభివృద్దికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన వెబ్‌సైట్‌ను కూడా సిఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. భాదితులకు తగిన న్యాయం జరగకపోతే నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కే.సునిత, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : సిఎంతో గిరిజన ఎమ్మెల్యేల భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్