Thursday, March 28, 2024
HomeTrending Newsసింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణిలో సమ్మె సైరన్

Strike Siren Once Again In Singareni :

సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా, పలు డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు. మొత్తం 5 డిమాండ్లను కార్మికులు యాజమాన్యం ముందు ఉంచారు. వచ్చే నెల 9 తర్వాత సమ్మెకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం( టీబీజీకేెెెఎస్) నోటీసులు కూడా ఇచ్చింది.

మొత్తం నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3,  సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాటు అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డు నిర్వహించ లేదని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఏడాది కాలంగా మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరిగిందని.. వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

నాలుగు గనుల ప్రారంభోత్సవానికి సింగరేణి యా జమాన్యం కోట్లాది రూపాయలు వెచ్చించి…పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రైవేటీకరణ చేయటంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కేంద్ర మంత్రిత్వశాఖ నిర్వహించే వేలం పాటను రద్దు చేయాలంటూ…ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభించాయి. ఈ విషయంలో కలిసికట్టుగా పోరాటాలకు జాతీయ సంఘాల నేతృత్వంలో నాయకులు సన్నద్దమవుతున్నారు.

Also Read : సింగరేణి దుర్ఘటనపై నేతల దిగ్బ్రాంతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్