Saturday, March 14, 2026
HomeTrending Newsఆక్వా వర్సీటీపై దృష్టి పెట్టండి: సిఎం

ఆక్వా వర్సీటీపై దృష్టి పెట్టండి: సిఎం

AP CM YS Jagan Review On Aqua University And Animal Husbandry :

ఆక్వా యూనివర్సిటీ  ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  భూసేకరణ పనులపై మరింత ధ్యాసపెట్టాలని,  కేంద్రప్రభుత్వంతో మాట్లాడి ఆక్వారంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్ జగన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

  • ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ మీద బాగా ప్రచారం చేయాలి, సీడ్, ఫీడ్‌ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా ఉండాలి
  • ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్‌ ఎలా చేయించుకోవాలన్నదానిపై అందరికీ సమాచారం తెలియాలి
  • 35 ల్యాబ్స్ లో ఇప్పటికే 14 ప్రారంభం కాగా, మరో 21 ల్యాబ్స్‌ నవంబర్‌లో ప్రారంభం, వీటిని ఆర్బీకేలకు అనుసంధానం చేయాలి
  • కేజ్‌ ఫిష్‌ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలి,  వీటితో ఆదాయాలు బాగా పెరుగుతాయి
  • కేజ్‌ ఫిష్‌ కల్చర్‌కు సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయండి. దీనిపై రైతులు, ఔత్సాహికులను కలిపి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించండి
  • ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పేదవాడు లాభపడేవిధంగా ఉండాలి
  • పైలెట్‌ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్‌ ఫిష్‌ కల్చర్‌ మూడు చోట్ల మరీకల్చర్‌ను మొదలుపెట్టాలి
  • వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలి
  • ప్రతి గ్రామంలో ఏముండాలి ? మండల కేంద్రంలో ఏముండాలి ? అన్నది నిర్ధారించాలి
  • గ్రామం, మండలం, నియోజకవర్గ స్ధాయిలో ఏయే డిస్పెన్షరీలు ఉండాలన్నదానిపై హేతుబద్ధత ఉండాలి
  • దానిపై కార్యాచరణ రూపొందించాలి
  • తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలి
  • మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కావాల్సిన డిస్పెన్షరీలను ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయి
  • వీటన్నింటిపై పటిష్టంగా మ్యాపింగ్‌ చేయాలి
  • పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుకు కార్యాచరణ
  • రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలి
  • నాడు–నేడులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందుగా నిర్ధారించుకోవాలి
  • ఏయే రకాల మౌలిక సదుపాయాలు  కల్పించాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలి
  • తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి

ఈ సమీక్షకు పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ ఆర్‌ అమరేంద్రకుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular