‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియాభట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయ్యింది.

త్వరలోనే ఆ రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరిట ఈ సినిమా మేకింగ్ వీడియోను ఈ నెల 15న ఉదయం 11గంటలకు విడుద‌ల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. ఈ రోజు చిత్రయూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మేకింగ్ వీడియోలో ఏం చూపించనున్నారు..? ఎన్టీఆర్, చరణ్ పాత్రలకు సంబంధించి మరిన్ని విశేషాలు ఇందులో చూపించనున్నారా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ మేకింగ్ వీడియోతోనే ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *