Monday, June 17, 2024
Homeసినిమాబన్నీ తో బరిలోకి దిగుతున్న త్రిప్తి దిమ్రి! 

బన్నీ తో బరిలోకి దిగుతున్న త్రిప్తి దిమ్రి! 

త్రిప్తి దిమ్రి .. ఇప్పుడు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. బాలీవుడ్ లో ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. 2017లోనే ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టింది. అయితే ‘యానిమల్’ సినిమాతో మరింత పాప్యులర్ అయింది. రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హాట్ .. హాట్ గా మెరిసింది. కురాళ్లకు కుదురులేకుండా చేసింది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు త్రిప్తి దిమ్రి లుక్స్ కి దొరికిపోయారు. ఆమె చూపుల్లో  చిక్కుకుపోయారు. తెరపై ఆమె కనిపించే నిడివి తక్కువే అయినా, యూత్ నుంచి ఆమె ఎక్కువ మార్కులను వసూలు చేసింది. ఈ సినిమా తరువాత సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెరిగి పోయింది. దక్షిణాది నుంచి కూడా చాలామంది ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు. దాంతో ఆమెను తీసుకోవడానికి కొంతమంది మేకర్స్ ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో చాలామంది వెనక్కి తగ్గినట్టుగా టాక్. ఈ నేపథ్యంలో ఆమె ‘పుష్ప 2’ సినిమాలో కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘పుష్ప’లో దేవిశ్రీ స్వరపరిచిన ‘ఊ అంటావా మావా’ పాటను ఆడియన్స్ ఇంతవరకూ మరిచిపోలేదు. అలాంటి ఒక హాట్ బీట్ నే ‘పుష్ప 2’లోను సెట్ చేశారట. ఆ పాట కోసం త్రిప్తి దిమ్రిని సంప్రదించినట్టుగా చెబుతున్నారు. ఇది బన్నీతో డాన్స్ .. పైగా పాన్ ఇండియా మూవీ. పారితోషికం విషయంలో బెంగపెట్టుకోవలసిన అవసరంలేని ప్రాజెక్టు. కనుక ఆమె ఈ పాటతో హుషారెత్తించడం ఖాయమైనట్టేనని అనుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్