Saturday, November 23, 2024
HomeTrending Newsఆకట్టుకున్న డిప్యూటీ సిఎం ధింసా నృత్యం

ఆకట్టుకున్న డిప్యూటీ సిఎం ధింసా నృత్యం

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాటి గిరిజన బిడ్డలతో కలిసి ధింసా నృత్యం చేశారు ఉప ముఖ్యమంత్రి.  ‘మా గిరిజన బిడ్డలతో కలిసి నృత్యం చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది’ అని ఆమె పేర్కొన్నారు. గిరిజన సోదర సోదరీమణులు అందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర కూడా పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం టిడిఎ కార్యాలయంలో కూడా ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా గిరిపుత్రుల విన్యాసాలు, సాంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. గిరిజన సంక్షేమానికి వైయస్సార్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ పరిధిలో ఉన్న గిరిపుత్రులు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్