Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఉద్యమం కాదు ఉన్మాదం : సురేష్

ఉద్యమం కాదు ఉన్మాదం : సురేష్

అమరావతి రాజధాని ఉద్యమం ఉన్మాదంగా మారిందని, వారు మాట్లాడుతున్న భాష అభ్యతరకరంగా ఉందని బాపట్ల ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ ఆరోపించారు. బాబు బినామీలు, ఆత్మ బంధువులు తప్ప మరెవరూ ఈ ఉద్యమంలో లేరని వెల్లడించారు.  అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరిందంటూ నిన్న జరిగిన నిరసనలో పాల్గొన్న మహిళలంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనన్నారు.

దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని సురేష్ విమర్శించారు. కేవలం రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే బాబుకు దళితులు గుర్తుకు వస్తారన్నారు. రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కొని వారికి మిగతా రైతులకు మాదిరిగా సరైన ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదని సురేష్ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో దళితులకు 53 వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయిస్తే ‘ఈ ప్రాంతం మురికి కూపంగా’ మారుతుందంటూ దాన్ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళినవారికి దళితులపై ప్రేమ ఉన్నట్లు ఎలా భావించాలని సూటిగా నిలదీశారు. 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రైతులను ఏంతో హింసించారని… బషీర్ బాగ్ కాల్పుల ఘటన దానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.

చంద్రబాబు సిఎంగా ఉండగా దళితుల భూములు దగ్ధం చేయించి, ఆ కేసును అక్రమంగా తనపై మోపి, చివరకు నిర్ధారించలేక కేసును మూసివేసిన విషయం వాస్తవం కాదా అని సురేష్ అడిగారు. బాబు కుట్రలను దళితులు గ్రహించాలని, అయన భ్రమలో పడి పరిగేడితే ప్రయోజనం ఉండదని హితవు పలికారు. సిఎం జగన్ అమరావతిలో ఏ ఒక్కరికీ నష్టం కల్గించబోరని సురేష్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్