Tuesday, June 16, 2026
HomeTrending Newsజగనే మళ్ళీ సిఎం - ఆస్తులు పందెం: ధర్మాన

జగనే మళ్ళీ సిఎం – ఆస్తులు పందెం: ధర్మాన

Challenge: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ మళ్ళీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఒకవేళ అలా కాకపొతే తన ఆస్తులన్నీ రాసిస్తానని ఛాలెంజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చెల్లాయివలసలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిఎం జగన్ లాంటి నాయకుడు ఇప్పటి వరకూ లేరని, భవిష్యత్తులో రాబోడని ‘న భూతో న భవిష్యత్’ అని  అభివర్ణించారు. మళ్ళీ జగనే సిఎం అవుతారని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు, అవసరమైతే తన ఆస్తి అంతా పందెం కడతానన్నారు. జగన్ ప్రజలకు మరింత మేలు చేస్తారని, అందరూ ఆయన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ తరువాత తామంతా గడప గడపకూ తిరుగుతామని, సంక్షేమ పథకాలు అమలు తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తామని, ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular