Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బిసిలు నాయకులుగా ఎదగాలి: సజ్జల

బిసిలు నాయకులుగా ఎదగాలి: సజ్జల

వెనుకబడిన తరగతులను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లతో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన బీసీ నాయకత్వం కోసమే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని  పేర్కొన్నారు.

బిసి కార్పొరేషన్ ఛైర్మన్లు తమ కులాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ బలమైన నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణు గోపాల కృష్ణ  మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. బిసిలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఈనెల 30న బిసి కార్పొరేషన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని మంత్రి వేణు అన్నారు.

ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ ‘‘సీఎం జగన్‌ బిసిలకు గౌరవం కల్పించారు. బిసికి చెందిన నన్ను డిప్యూటీ సీఎం చేయడమే నిదర్శనం’’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్