సాగునీటిపై హక్కుపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 1994-2004 వరకు అధికారంలొ ఉన్న టిడిపి ఏ ప్రాజెక్టు చేపట్టకపొవడం వల్ల బ్రిజేష్ కూమార్ ట్రిబ్యూనల్ లొ ఏపికి చాలా అన్యాయం జరిగిందని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యమని అయన పేర్కొన్నారు.
శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలోని ముఖ్యంశాలు:
- వ్యవసాయం దండగని డైరీలొ రాసుకుని సీమ వాసులను గుండెకొతకు గురిచేశాడు
- నిధులు ఇవ్వకుండా శంకుస్దాపనలు చేసిన ఘనత బాబుది…
- గండికొట సామర్ద్యం తగ్గించి శంకుస్దాపన చేశారు
- కృష్ణా జలాలపై ఉన్న హక్కు కొల్పొయేలా చేశారు
- మిగులు జలాలు వాడుకుంటామని వైఎస్ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల కొన్ని కేటాయింపులైనా వచ్చాయి
- మళ్లీ అధికారంలొకి వచ్చి ప్రాజెక్టులు అపేశారు..
- సాగునీటిపై అవగాహన, చిత్తశుద్ది లేని వ్యక్తి చంద్రబాబు
- కుళ్లు, కుతంత్రాలు ఒంటబట్టించుకున్న వ్యక్తి చంద్రబాబు…
- శ్రీశైలంలొ కనీస నీటిమట్టం మెయిన్ టైన్ చేయాలన్నా చంద్రబాబు పట్టించుకొలేదు
- సీమ ప్రాజెక్టుల పట్ల వైఎస్అర్ అశయాన్ని జగన్ కొనసాగిస్తున్నారు
- వైఎస్అర్, జగన్ వల్లే సీమ ఎత్తిపొతల పథకం బ్రతికి ఉంది
- బాబు, పవన్ ఇద్దరు అప్పడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్లే వారే
- హైదరాబాద్ లొ ఉంటూ భయపడి ఏపి సాగునీటిని తాకట్టు పెట్టారు
- శ్రీశైలంలొ కనీస నీటిమట్టం రాకముందే తెలంగాణా ప్రభుత్వం దిగువకు వదిలుతుంది
- 800 అడుగులు రాకముందే విద్యుత్ ఉత్పత్తి చేశారు
- సీమ ప్రాజెక్టుల కొసం ఎంత వరకైనా పోరాడతాం
- సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను గెజిట్ లొ పొందుపరిచే వరకు పోరాడతాం
- రాజకీయాలు చేయకుండా బాబు సహకరించాలి…
- మైసూరారెడ్డి ఎవరి అజెండానొ మనస్సులొ పెట్టుకుని మాట్లాడుతున్నారు…
- తెలంగాణా వ్యతిరేకించే అంశాలను మైసూరారెడ్డి సమర్ధిస్తున్నారు
- ఇరు రాష్టాలు బాగుండాలని సిఎం జగన్ కొరుకుంటున్నారు
- కానీ తెలంగాణా ప్రభుత్వం సహకరించడం లేదు
- తెలంగాణా రైతులు నష్టపొవాలని ఏపి ప్రభుత్వం కోరుకొవడం లేదు