Thursday, May 8, 2025
HomeTrending Newsరివర్స్ టెండరింగ్ రద్దు: ఏపీ కేబినెట్ నిర్ణయం

రివర్స్ టెండరింగ్ రద్దు: ఏపీ కేబినెట్ నిర్ణయం

రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ ఎక్సైజ్ విధానాన్ని, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) ను కూడా రద్దు కు ఆమోదం తెలియజేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

కేబినెట్ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు:

  • ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ
  • సిఎంఓ పేషీల్లో 71 పోస్టుల భర్తీ
  • పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణ
  • సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ
  • 21.86 లక్షల పాస్ పుస్తకాలపై, 77 లక్షల సర్వే రాళ్ళపై వైఎస్ జగన్ బొమ్మ తొలగింపు
  • వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత
  • 22ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యు సదస్సులు
  • కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ షాపుల్లో ఈపిఓఎస్ మిషన్లు
RELATED ARTICLES

Most Popular

న్యూస్