Sunday, January 19, 2025
HomeTrending Newsఫసల్ భీమాలో ఏపీ భాగస్వామ్యం: సిఎం జగన్

ఫసల్ భీమాలో ఏపీ భాగస్వామ్యం: సిఎం జగన్

Fasal bima:  కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో భాగస్వామ్యం కావాలని సీఎం సూత్రప్రాయ నిర్ణయం ఈ సమావేశంలో తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ మంచి మోడల్‌ను పొందుపరచాలని సిఎం జగన్ కోరారు.

ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి, రైతు శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సిఎం కేంద్ర అధికారులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రబృందం ప్రశంసలు కురిపించింది. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్‌ అహూజా ఇతర ఉన్నతాధికారులు సిఎం ను కలుసుకున్న బృందంలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్