Sunday, June 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్నెలకు రెండు సార్లు జాబ్ మేళా : మేకపాటి

నెలకు రెండు సార్లు జాబ్ మేళా : మేకపాటి

ఇకపై ప్రతి జిల్లాలో నెలకు 2 సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు, ఈ మేళాలు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మొదలు పెడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై గౌతమ్ రెడ్డి ఆరాతీశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ….

  • స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగం పెంచాలి
  • బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలి
  • స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ట్రైనింగ్, ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  • ఆగస్ట్ 15వ తేదీన డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ప్రారంభానికి సన్నాహాలు చేయాలి
  • స్కిల్ డెవలప్ మెంట్ తో ఎంప్లాయ్ మెంట్, ట్రైనింగ్ ని అనుసంధానంచేసే ప్రక్రియను వేగవంతం చేయాలి
  • ఎంప్లాయ్ మెంట్, ట్రైనింగ్ లకు ప్రాధాన్యత పెంచే దిశగా చర్యలు
  • అరుంధతి సాఫ్ట్వేర్ సహకారంతో వేగంగా నమోదు ప్రక్రియ చేపట్టాలి
  • అత్యాధునిక కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తే ఉద్యోగాల కల్పన సులభమవుతుంది
  • అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలి

ఈ సమీక్షలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్ లావణ్య వేణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, నైపుణ్య శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎఫ్ సీ సీఎఫ్ఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular