Saturday, January 18, 2025
HomeTrending Newsఇకపై ‘నో’ ఇంటర్వ్యూ

ఇకపై ‘నో’ ఇంటర్వ్యూ

ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నుంచి అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసమే ఇంటర్వ్యూల విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

2021-22 ఆర్ధిక సంవత్సరానికి వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల క్యాలెండర్ ను జూన్ 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి పైరవీలకు, సిఫార్సులకు, అవినీతికి, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే, ఎలాంటి ఇంటర్వ్యూలకు అవకాశం లేకుండా ఈ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు వెలువరించడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్