Friday, October 18, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్‘వైఎస్సార్ బీమా’ సరళతరం

‘వైఎస్సార్ బీమా’ సరళతరం

పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు మృతుల కుటుంబ సభ్యులకు వెంటనే సాయమందేలా వైఎస్సార్ బీమా పథకంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

దీని ప్రకారం ప్రకారం సంపాదించే వ్యక్తి 18-50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి… సహజంగా మరణిస్తే రూ. లక్ష ఆర్థిక సాయం, సంపాదించే వ్యక్తి 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు కలవారై… ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రభుత్వం అందించే మొత్తాన్ని మృతుల నామినికీ చెల్లించాలని నిర్ణయించారు. బీమా సంస్థ ద్వారా ఈ పరిహారాన్ని అందజేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. ఎంపికైన బీమా సంస్థకు ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. కార్మిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని ప్రభుత్వం అమల చేయనుంది. బీపీఎల్ కుటుంబాలను ఈ నెలాఖరులోగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్సార్ బీమా అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్