Thursday, April 25, 2024
HomeTrending Newsయూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

యూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ లో తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. యూపీలో ఓ.పి.రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్పీ పార్టీతో కలిసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’లో భాగంగా ఉన్నామన్నారు. ఇక ఇతర ఏ పార్టీలతోనూ పొత్తు విషయంపై చర్చించలేదన్నారు. కూటమిలో మరో ఎనిమిది చిన్న పార్టీలు కూడా ఉండడం గమనార్హం.

ఈ కూటమిలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కూడా భాగం కానుందని నిన్నటి వరకు ఊహాగానాలు వినిపించాయి. ఓవైసీ, మాయావతి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. కానీ, నేడు ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆమె.. యూపీ, ఉత్తరాఖండ్‌లో  బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. గత బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీకి దిగిన ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుపొందింది. కానీ, ఇటీవల బెంగాల్‌ సహా తమిళనాడులో ఘోర పరాభవం చవిచూసింది. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.

పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా పోటి చేసిన మజ్లీస్ సీట్లు గెలవలేకపోయినా ఇతర పార్టీల విజయావకాశాల్ని ప్రబావితం చేసింది. బిఎస్పి, మజ్లీస్ పార్టీల ప్రభావంతో మైనారిటీల ఓట్లు చీలి చాలా చోట్ల సమాజ్ వాది పార్టీ అపజయం చవిచూసింది. 2017 ఎన్నికల్లో 38 శాసనసభ స్థానాల్లో పోటి చేయగా నాలుగు సీట్లలో రెండో స్థానం దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్