Sunday, November 24, 2024
HomeTrending Newsప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు.  జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి కోరమాండల్‌ రైల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్న అధికారులు. ఈ డేటా ఆధారంగా ప్రమాదంలో ఎవరైనా రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ఉన్నారా? అన్నదానిపై ముమ్మరంగా విచారణ చేపట్టారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులనుంచి ఫొటోలు సేకరిస్తున్నారు.  అంబులెన్స్‌లు సిద్ధంచేయడంతోపాటు, క్షతగాత్రులకు వైద్యసేలు అందించే అంశంపై అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు,  విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏర్పాటు చేసి… 1070, 112, 18004250101 హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.  మీకు సంబంధించి మిస్సయిన వారి  సమాచారం కోసం 8333905022 నెంబర్ కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని వివరాలు తెలియజేస్తామని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. ఆర్ అంబేద్కర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్