Sunday, January 19, 2025
HomeTrending Newsముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం కాగానే జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. వీటిని  – కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వం పేర్కొంది. అయితే కాసేపటి తర్వాత ఈ జీవోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.  డీజీపీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదే కేసులో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డిజిపి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఐపీఎస్ లపై సస్పెన్షన్ వెనుక ఈ ఒక్క కేసు మాత్రమే కాక గత ప్రభుత్వ హయంలో అధికార పార్టీ సూచనలతో పలువురిని వేధించారని, టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారనే ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్