Sunday, January 19, 2025
HomeTrending Newsగవర్నకు అస్వస్థత : ఏఐజిలో చికిత్స

గవర్నకు అస్వస్థత : ఏఐజిలో చికిత్స

AP Governor fall ill:

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్నుమెరుగైన వైద్య పరీక్షల కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ  ఆస్పత్రికి తరలించారు.

గత గురు, శుక్రవారాల్లో హరిచందన్ ఢిల్లీ లో పర్యటించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్వహించిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం విజయవాడ చేరుకున్న గవర్నర్ అస్వస్థతకు గురయ్యారు. అయన ఊపిరితుత్తుల, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నేటి ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న గవర్నర్ ను నేరుగా ఏ ఐ జి ఆస్పత్రికి తరలించారు. అయన ఆరోగ్య విషయంలో అందోళన చెందాల్సింది ఏమీ లేదని, మధ్యాహ్నం లోగా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read : మూడు జ‌న్మ‌లెత్తినా సాధ్యం కాదు: నారా లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్