Sunday, January 19, 2025
HomeTrending Newsజస్టిస్ రమణకు గవర్నర్ తేనీటి విందు

జస్టిస్ రమణకు గవర్నర్ తేనీటి విందు

CJI in Raj Bhawan:  రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ నేడు కూడా పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. ఉదయం నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగిన జుడిషియల్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ అసోసియేషన్ సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

సాయంత్రం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గౌరవార్ధం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో సిఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం బెజావాడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు,.

Also Read :  జస్టిస్ రమణకు ప్రభుత్వం తేనీటి విందు

RELATED ARTICLES

Most Popular

న్యూస్