Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Another Dil: గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్ఎమ్ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పిస్తున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’. ఎస్ సోమరాజు నిర్మాతగా, సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నూతన  చిత్రం పూజా కార్యక్రమాలు ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జ‌రిగాయి.  శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రవితేజ్, మిస్ మహారాష్ట్రగా గెలుపొందిన అనిత షిండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ క్లాప్ కొట్టగా, జైపాల్ కెమెరా స్విచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ వినగానే సినిమా చేద్దామని నిర్మాత సోమరాజు గారు నిర్ణయించుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చేద్దాం.. సక్సెస్ చేద్దాం అని సపోర్ట్ ఇచ్చారు. రొటీన్ కథల‌కు బిన్నంగా ఈ స్టోరీ ఉంటుంది. జనవరి 15 తరువాత షూటింగ్ ప్రారంభించి మే లో సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు.

నిర్మాత సోమరాజు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి రీల్ ఇండస్ట్రీ కి పరిచయం చేశారు మా దర్శకుడు సురేష్. అందుకు ఆయనకు నా ధన్యవాదాలు. ‘దిల్ తో పాగల్ హై’ స్టోరీ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. బడ్జెట్ ప్రాబ్లెమ్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం అనుకొని సినిమా చేయడం జరుగుతోంది. ఈ సినిమా తరువాత ప్రతి 6 నెలలకు ఒకసారి సినిమాలను తీయాలని నిర్ణయుంచుకున్నాం అన్నారు.

ప్రసన్నకుమార్ మాట్లాడుతూ. “డైరెక్టర్, ప్రొడ్యూసర్ పేర్లలోనే ఎస్ ఎస్ ఉంది. సో అక్కడే వీరి సక్సెస్ కనపడుతోంది. దిల్ తో మొదలైన ఈ సినిమా దిల్ సినిమా, అలాగే టైటిల్ తో బ్లాక్ బస్టర్ అయిన సాంగ్ లా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని భావిస్తూ అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు.

హీరో రవి తేజ్ మాట్లాడుతూ.. మొదటి సారి కథ వింటున్నప్పుడే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. అప్పుడే నా పాత్ర‌కు పూర్తి న్యాయం చేస్తాన‌ని చెప్పాను. ప్రేమ ఖైదీ, ఉప్పెన  సినిమాల్లా అందరికీ నచ్చే సినిమా అవుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com