Wednesday, March 11, 2026
HomeTrending Newsజనసేనకు హైకోర్టులో ఊరట

జనసేనకు హైకోర్టులో ఊరట

⁠జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసును  ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించింది.  కాగా ఈ సింబల్ ను తమకు ఇవ్వాలని జనసేన కు వేరే గుర్తు ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రెండు వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలు చేసింది.

నిబంధనల మేరకే గ్లాసు సింబల్ ను జన సేన పార్టీకి కేటాయించామని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. నిబంధనలు అనుగుణంగా జనసేన దరఖాస్తు చేయలేదని అందుకే ఆ గుర్తును తమకే ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) తరఫున వాదించారు.  దీనిపై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
నేడు తీర్పు వెలువరించిన ధర్మాసనం జనసేనకు గాజు గ్లాసు కేటాయించాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular