Saturday, June 13, 2026
Homeసినిమాఅల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో?

అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ మంచి రెస్పాన్స్ ను రాబడుతూ, అందరిలో అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా సంచలనాన్ని నమోదు చేయడం ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బన్నీ తరువాత సినిమా ఏ దర్శకుడితో ఉండనుంది? అనే ఒక ఆసక్తి అభిమానులలో తలెత్తుతోంది. బన్నీకి కథ వినిపించి ఓకే అనిపించుకున్న దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ .. బోయపాటి .. తమిళ దర్శకుడు అట్లీ కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు దర్శకులలో ముందుగా ఎవరితో బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడనే ప్రశ్నకి సమాధానంగా ముందుగా త్రివిక్రమ్ పేరే వినిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు విషయంలో ఆలస్యం ఉందనుకుంటే అట్లీ సినిమానే ముందుకు వెళుతుందనే టాక్ వినిపిస్తోంది.

అట్లీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చాలా కాలమవుతోంది. అందునా ఇటీవల బాలీవుడ్ లో ‘జవాన్’ హిట్ ఇచ్చిన తరువాత అట్లీ క్రేజ్ మరింత పెరిగింది. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే బన్నీ సినిమా కోసం జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే అది త్రివిక్రమ్ సినిమా కోసమా? లేదంటే అట్లీ మూవీ కోసమా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. చూడాలి మరి బన్నీ ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళతాడో. జాన్వీతో సంప్రదింపులు జరుగుతున్నది ఎవరి సినిమా కోసమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular