Sunday, September 8, 2024
HomeTrending News53,54 జీవోలు చెల్లవు: హైకోర్టు

53,54 జీవోలు చెల్లవు: హైకోర్టు

GOs Suspended: ప్రైవేటు స్కూళ్ళు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 53,54 నంబర్ జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అన్ని  స్కూళ్ళు, జూనియర్ కాలేజీల అభిప్రాయాలు తీసుకొని ఫీజుల ధరలు నిర్ణయించాలని హైకోర్టు సూచించింది. వారి ప్రమేయం లేకుండా ఫీజులను ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ జీవో ఇచ్చారని ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షక కమిషన్ సిఫార్సుల మేరకు ఫీజులను ఈ విధంగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.

ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి….

గ్రామ పంచాయతీ పరిధిలో
నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ ఏడాదికి 10 వేల రూపాయలు మించకుండా
6 నుంచి 10వ తరగతి వరకూ ఏడాదికి 12 వేల రూపాయలు మించకుండా

మున్సిపాలిటీ పరిధిలో
నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ ఏడాదికి 11వేల రూపాయలు మించకుండా
6 నుంచి 10వ తరగతి వరకూ ఏడాదికి 15వేల రూపాయలు మించకుండా

కార్పోరేషన్ పరిధిలో
నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ ఏడాదికి 12వేల రూపాయలు మించకుండా
6 నుంచి 10వ తరగతి వరకూ  ఏడాదికి 18వేల రూపాయలు మించకుండా

ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సంబంధించి….

గ్రామ పంచాయతీ పరిధిలో
ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు – ఏడాదికి 15  వేల రూపాయలు మించకుండా
సైన్స్ యేతర గ్రూపులకు – ఏడాదికి 12  వేల రూపాయలు మించకుండా

మున్సిపాలిటీ పరిధిలో
ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు – ఏడాదికి 17  వేల రూపాయలు మించకుండా
సైన్స్ యేతర గ్రూపులకు – ఏడాదికి 15 వేల రూపాయలు మించకుండా

కార్పోరేషన్ పరిధిలో
ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు – ఏడాదికి 20  వేల రూపాయలు మించకుండా
సైన్స్ యేతర గ్రూపులకు – ఏడాదికి 18 వేల రూపాయలు మించకుండా  మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం జీవోల్లో పేర్కొంది.

దీనిపై ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Also Read : ఇళ్ళ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్