Friday, March 28, 2025
HomeTrending Newsజశ్వంత్ కుటుంబానికి అండగా ఉంటాం

జశ్వంత్ కుటుంబానికి అండగా ఉంటాం

అమర జవాన్ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని దరివాడ కొత్తపాలెంలో సైనిక లాంచనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యుటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి సెక్టార్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరుప్రోలు జశ్వంత్ రెడ్డి గురువారం నాడు అసువులు బాశారు.

అతి పిన్న వయసులోనే జశ్వంత్ రెడ్డి మరణించడం బాధాకరమని, దేశ రక్షణలో అయన చేసిన త్యాగం మరువలేనిదని మంత్రి సుచరిత కొనియాడారు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సాయం 50 లక్షల రూపాయల చెక్కును తల్లిదండ్రులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని, కుటుంబలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చేలా సిఎం జగన్ తో మాట్లాడానని హామీ ఇచ్చారు. పరిసర గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమర జవానుకు నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్