Friday, March 29, 2024
HomeTrending Newsచీటింగ్ ఒన్స్ మోర్ : రేవంత్ రెడ్డి

చీటింగ్ ఒన్స్ మోర్ : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటి చెప్పిందని, ఇప్పుడు 50 వేల ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తామనడం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. వివిధ కార్పోరేషన్లలో ఉన్న ఖాళీలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసియార్ కు లేఖ రాశారు.

స్టాఫ్ నర్సులు దేవుళ్ళని కేసియార్ పొగిడారని, అలాంటి నర్సులు 1600 మందిని ఉద్యోగాలనుంచి తొలగించి రోడ్డున పడేశారని, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, వారి గోడు వినే ఓపిక లేదా అంటూ రేవంత్ సిఎంను ప్రశ్నించారు. వారిని యధాతథంగా విధుల్లో కొనసాగించాలని లేఖలో కోరారు. 2018లో ఎంపికైన ఏఎన్ఏం లకు ఇప్పటికీ పోస్టింగ్ లు ఇవ్వలేదని, తాజాగా ప్రకటించిన 50 వేల ఉద్యోగాల భర్తీ చీటింగ్ ఒన్స్ మోర్ అన్నట్లుగా ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్తులన్నీ భర్తీ చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్