Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్లోకాయుక్త కార్యాలయం ప్రారంభం

లోకాయుక్త కార్యాలయం ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త రాష్ట్ర  కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి  కర్నూల్ లోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో కొనసాగుతున్న లోకాయుక్త  కార్యాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలంటూ గత నెలలో ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  ఈ మేరకు కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆగస్ట్ ఆరవ తేదీన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 88ని ఆగస్టు 24న విడుదల చేసింది, దీన్ని నోటిఫై చేస్తూ 26న గెజిట్ కూడా విడుదలైంది.

ఈ రోజు (ఆగస్ట్ 28)న జరిగిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త సంస్థ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, కర్నూల్ జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు,  జిల్లా ఎస్పీ సి.హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త సంస్థ సెక్రటరీ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తమ గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడిని  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి విలీనం చేసుకోవాలని   లోకాయుక్తకు మొట్టమొదటి సమస్యను విన్నవిస్తూ కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఆరేపల్లి వరలక్ష్మమ్మ అనే  వృద్ధురాలు వినతిపత్రాన్ని అందచేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్