Muthaa Mestri: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హీరోయిన్ గా చిరు సరసన ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు చిత్రాల్లో నటించిన రోజా ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం కుటుంబంతో కలుఇ తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ ను కలుసుకున్న రోజా ఆ తర్వాత చిరంజీవి నివాసానికి వెళ్ళారు. చిరు దంపతులు రోజాకు సాదరంగా స్వాగతం పలికారు. రోజాను శాలువా, బోకేతో సత్కరించారు. రోజా కూతురు, కుమారుడిని చిరు ఆప్యాయంగా హత్తుకున్నారు. సిని పరిశ్రమ నుండి వెళ్లి ఏపీ రాజకీయల్లో తనదైన ముద్రను వేసి, మంత్రి పదవి చేపట్టిన రోజాను చిరు అభినందించారు.

Roja Chiranjeevi

“చిరంజీవి గారు చూపించిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మరవలేం సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ రోజా కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read : పర్యాటక అభివృద్ధికి కృషి: మంత్రి రోజా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *