Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు: రోజా

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు: రోజా

యువత క్రీడలపట్ల ఆసక్తి ప్రదర్శించడం ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చనని రాష్ర్ట పర్యాటక, క్రీడా, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ది శాఖా మంత్రి శ్రీమతి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో 66వ రాష్ర్ట స్ధాయి రోల్ బాల్ క్రీడా పోటీలు జరిగాయి. అన్ని జిల్లాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.  ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా హాజరైన రోజా క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ర్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. క్రాడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మొట్టమొదటిగా నిర్వహించిన రోల్ బాల్ టోర్నమెంట్ క్రీడాకారులు, ప్రేక్షకులు కేరింతల మధ్య ఆధ్యంతం ఉత్సహాభరితంగా సాగింది. అండర్-17 బాలుర రోల్ బాల్ చాంఫియన్ షిప్ ని చిత్తూరు జిల్లా జట్టు 6-3 స్కోర్ తేడాతో విశాఖపట్నంపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.  బాలికల విభాగంలో కృష్ణా, నెల్లూరు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెల్చుకున్నాయి.  అండర్-14 బాలుర భాగంలో చిత్తూరు, కృష్ణా జిల్లాలు….. బాలికల విభాగంలో కృష్ణాజిల్లా నెల్లూరు జట్లు…ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు మంత్రి రోజా ట్రోఫీలను అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular