Saturday, March 14, 2026
HomeTrending NewsReview: ఓడిశా ఘటన మృతుల్లో ఏపీ వారు లేరు: బొత్స

Review: ఓడిశా ఘటన మృతుల్లో ఏపీ వారు లేరు: బొత్స

ఓడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో దుర్మరణం పాలైన వారిలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు నిర్ధారిత సమాచారం ఏమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ప్రమాద ఘటనలపి విశాఖలో మంత్రులు జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వర్రావు, అధికారులతో కలిసి బొత్స సమీక్షించి అనతరం మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి జగన్‌ ఈఘటనపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన బృందాన్ని ఒడిశాకు పంపామని తెలిపారు.

బొత్స వెల్లడించిన ముఖ్యాంశాలు:

  • కోరమాండల్‌ సహా యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నాం
  • ఏపీలో ఈరైళ్లు ఆగే ఆయా స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించాం
  • కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించాం
  • వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారు
  • వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్‌ చేస్తున్నాం
  • 267 మంది సురక్షితంగా ఉన్నారని తేలింది, 20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి
  • 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైంది
  • 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ చేయడమో జరిగింది, వీరి వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నాం
  • అలాగే హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారు:
  • విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నారు:
  • ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారు, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారు, 10 మంది ట్రైను ఎక్కలేదు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అవడమో జరిగింది:
  • ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకూ కూడా ఆస్పత్రులను అలర్ట్‌ చేశాం:
  • గాయపడ్డవారు ఎవరు వచ్చినా.. వారికి చికిత్స అందిస్తాం:
  • విశాఖకు చేరుకున్న గాయపడ్డ ప్రయాణికులు ఇద్దరిని వెంటనే సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించాం:
  • వీరిలో ఒకరి తలకు, మరికొరికి వెన్నుపూసకు గాయం అయ్యింది, మెరుగైన వైద్యం అందిస్తున్నాం:
  • ఒడిశాకు 108 అంబులెన్స్‌ లు 25, ప్రయివేటు అంబులెన్స్‌ లు మరో 25  మొత్తంగా 50 వాహనాలు పంపించాం
  • ఇవికాకుండా ఎమర్జెన్సీ కార్యకలాపాలకోసం ఒక ఛాపర్‌ను కూడా సిద్ధంచేశాం, అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేస్తాం, నేవీ సహకారాం కూడా తీసుకుంటున్నాం:
  • సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి.. ఇంకా ఏమీ నిర్ధారించలేం
  • కాని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం
  • ముఖ్యమంత్రిగారు టైం టు టైం సమీక్ష చేస్తున్నారు:
  • పేషెంట్లను అవసరమైతే భువనేశ్వర్‌ అపోలోలో చేర్పించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం:
  • ఈ మేరకు అపోలో ఆస్పత్రితో మాట్లాడాం
  • ప్రయాణికుల కుటుంభ సభ్యులు ఎవరైనా తమ వారి సమాచారాన్ని జిల్లాకలెక్టర్లకు అందించాలని కోరుతున్నాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular