అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్ అతుల్

ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి అజయ్ – అతుల్ ద్వయం సంగీతం అందించారు. అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ ప్రముఖ సంగీత విద్వాంసుడు బైక్‌ పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు. అవును, మీరు విన్నది కరెక్టే. ముంబై నుంచి బైక్ లో ప్రయాణించి తిరుపతి చేరనున్నారు.

అయితే.. ఇలా ఎందుకో తెలుసా? ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తిరుపతిలో ఘనంగా జరగనున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఇలాంటి కొత్త పనిని చేయనున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇక అతుల్ జూన్ 3న ముంబైలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నాడు. తిరుపతి చేరుకున్న తర్వాత, అతుల్ ఆయన సోదరుడు అజయ్ తో కలిసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు కూడా ఆ విష్ణు మూర్తి అవతారాలే కాబట్టి ఆయన్ని దర్శించుకుని సినిమాకు మంచి చేయాలని కోరుకోబోతున్నారు.

మరో పక్క ప్రభాస్ మరియు ఆదిపురుష్ అభిమానులు తిరుపతిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నగరంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అక్కడి వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా, ఇలాంటి పనులు బైక్ రైడర్స్ చేస్తూ ఉంటారు. అయితే సంగీత రంగంలో తొలిసారిగా ఓ సంగీత విద్వాంసుడు సినిమా పై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఈ విధంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ రైడ్ చేయబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *