Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్FIH Pro-Hockey League: ఇంగ్లాండ్ పై  ఇండియా షూటౌట్

FIH Pro-Hockey League: ఇంగ్లాండ్ పై  ఇండియా షూటౌట్

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్)  పురుషుల ప్రోలీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఇండియా షూటౌట్ విజయం సాధించింది. ఆట ఆఖరి క్షణాల్లో అభిషేక్ చేసిన చేసిన గోల్ తో ఇండియా పరాజయం తప్పించుకొని షూటౌట్ కు వెళ్ళింది.

ఆట 7వ నిమిషంలోనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఇండియాకు తొలి గోల్ అందించాడు. ఆ మరుసటి నిమిషంలోనే ఇంగ్లాండ్ ప్లేయర్ వార్డ్ శామ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.

19, 28 నిమిషాల్లో మన్ దీప్, సుఖ్ జీత్ లు చెరో ఫీల్డ్ గోల్ తో ఇండియా స్కోరును 3-2 ఆధిక్యానికి తీసుకెళ్ళారు. అయితే, 40,47,53 నిమిషాల్లో ఇంగ్లాండ్ కు మూడు గోల్స్ వచ్చాయి, వీటిలో ఒక పెనాల్టీ కార్నర్, రెండు ఫీల్డ్ గోల్స్ ఉన్నాయి. దీనితో ఇంగ్లాండ్ 4-3 ఆధిక్యంలో నిలిచి గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో ఆట మరికొన్ని క్షణాల్లో ముగుస్తున్న సమయంలో అభిషేక్ అద్భుతంగా రాణించి స్కోరు సమం చేశాడు. దీనితో షూటౌట్ వెళ్ళక  తప్పని పరిస్థితి.

షూటౌట్ లో ఇండియా 2-4తో విజయం అందుకుని రెండు పాయింట్లు సంపాదించింది. అయితే పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ ఇప్పటికీ అధిక్యంలోనే ఉంది,.

నెదర్లాండ్స్ వేదికగా ఇండియా తన తర్వాతి మ్యాచ్ లలో అర్జెంటీనా, నెదర్లాండ్స్ దేశాలతో జూన్ 7,8,10,11 తేదీల్లో తలపడుతుంది. ఈ మ్యాచ్ ల తర్వాత ఇండియా ఈ లీగ్ ను పూర్తి చేసుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్