Sunday, September 8, 2024
HomeTrending Newsసమాఖ్య స్పూర్తికి విరుద్ధం : మేకపాటి

సమాఖ్య స్పూర్తికి విరుద్ధం : మేకపాటి

కేంద్రం తీసుకొచ్చిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020లో కొన్ని అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సమావేశం వర్చువల్ గా జరిగింది. పోర్టుల ముసాయిదా బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ బిల్లును అధ్యయనం చేయడం కోసం నిపుణుల కమిటీని నియమిస్తామని నెల రోజుల్లో రాష్ట్రం తరఫున సమగ్ర నివేదికను ఇస్తామని, దీనికి అనుగుణంగా గడువు ఇవ్వాలని మేకపాటి సమావేశంలో కోరారు. మైనర్ పోర్టులపై నియంత్రణ కూడా కేంద్రం చేతికి వెళ్ళడం రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గౌతమ్ రెడ్డి సమావేశంలో వివరించారు.

పోర్టులపై పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని, కానీ కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లును యధాతథంగా ఆమోదిస్తే పోర్టులపై అజమాయిషీ మొత్తం కేంద్రం చేతుల్లోకే వెళుతుందని గౌతమ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారని మేకపాటి తెలియజేశారు.

కేంద్రం చేపట్టే మంచి పనులకు, నిర్ణయాలకు అంశాల వారీగా మద్దతిస్తామని….రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం మా సిఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగీకరించదని, అవసరమైతే తీరప్రాంత రాష్ట్రాల మద్దతు తీసుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తామని మేకపాటి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్