Saturday, July 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిఎంతో క్షత్రియ నేతల భేటి

సిఎంతో క్షత్రియ నేతల భేటి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు క్షత్రియ నేతలు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

సిఎంను కలిసిన వారిలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ పి.వి.సూర్యనారాయణ రాజు, పాతపాటి సర్రాజు, కేకే రాజు, గాదిరాజు నారాయణ రాజు తదితరులు ఉన్నారు.

ఇటీవలి కాలంలో నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును సిఐడి అరెస్టు చేసిన సమయంలో కొందరు క్షత్రియ నేతలు ఖండించారు. మరి కొందరి ఇది కులానికి సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు. ఆ తర్వాత  మన్సాస్ ట్రస్టు విషయంలో అశోక్ గజపతి రాజును ఇబ్బంది పెట్టారని, మంత్రి వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారని, మంత్రిని నియంత్రించాలని సిఎం జగన్ మోహన్ రెడ్డిని కోరుతూ క్షత్రియ సంఘం తరఫున పత్రికా ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనను మంత్రి శ్రీ రంగనాథ రాజు ఖండించారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, ఈ ప్రకటన చంద్రబాబే ఇప్పించారని ఆరోపించారు.

ఈ పరిణామాల నేపధ్యంలో క్షత్రియ సామాజిక వర్గం నాయకులు ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్