Wednesday, March 18, 2026
HomeTrending Newsదావోస్‌లో ఏపీ: ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై దృష్టి

దావోస్‌లో ఏపీ: ఇండస్ట్రియలైజేషన్‌ 4.0పై దృష్టి

WEF-Davos:  రెండేళ్ల కోవిడ్‌ విపత్తు తర్వాత వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22 –26వరకూ జరగనున్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డితో పాటు, మంత్రులు, అధికారుల బృందం పాల్గొననున్నారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్‌ వేదికగా ఏపీ వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారంకోసం జరిగే చర్చల్లో ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం(ఇండస్ట్రియలైజేషన్‌ 4.0) దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్‌ వేదికగా సీఎం కీలక చర్చలు కూడా జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు.

కోవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన వ్యూహాన్ని దావోస్‌ వేదికపై రాష్ట్రం వినిపించనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌ మెంట్‌ ద్వారా కోవిడ్‌ కట్టడికి చేసిన విశేష ప్రయత్నాలను వివరించనుంది. ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, çసమగ్ర సాజికాభివృద్ధిలో భాగంగా నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ– సుపరిపాలన, ఉత్తమ భవిష్యత్త్‌ తరాల నిర్మాణంకోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఏపీ వివరించనుంది. వీటితోపాటు సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి తదితర అంశాలపైనా ఈ సదస్సులో ఏపీ దృష్టిసారించనుంది.

కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ, డోర్ డెలివరీ వ్యవస్థను మరింత బలోపేతంచేయడం, దీన్ని డిటిటలైజేషన్‌తో అనుసంధానం చేయడం, రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధి చేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారుచేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధిచేయడం లాంటి అంశాలపై అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై కూడా దావోస్‌ సదస్సులో ఏపీ దృష్టిపెట్టనుంది. ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. పీపుల్‌ –ప్రోగ్రెస్‌ – పాజిబిలిటీస్‌ నినాదంతో ఈ పెవిలియన్‌ నిర్వహిస్తోంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్‌ కాంగ్రెస్‌ పలు కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. ఆహారం – వాతావరణ మార్పులు, సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్‌ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం – పునర్‌ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చల్లో ఏపీ భాగస్వామ్యం కానుంది.

Also Read : సిఎంను కలిసిన అమెరికా కాన్సుల్‌ జనరల్‌ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular