Tuesday, June 9, 2026
Homeసినిమాకమల్ హాసన్ 'విక్రమ్' హక్కులు సొంతం చేసుకున్న నితిన్

కమల్ హాసన్ ‘విక్రమ్’ హక్కులు సొంతం చేసుకున్న నితిన్

Rights Reserved: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు.

టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్‘ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తుంది. శ్రేష్ట్ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విక్రమ్ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడంతో సినిమా ఖచ్చితంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు విజువ‌ల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular