Friday, April 19, 2024
Homeసినిమాకమల్ హాసన్ `విక్రమ్` రిలీజ్ ఎప్పుడు?

కమల్ హాసన్ `విక్రమ్` రిలీజ్ ఎప్పుడు?

Kamal-Vikram: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విజయవంతమైన చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి చేసిన మొదటి చిత్రం ‘విక్రమ్‘ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. వేసవిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ ఎప్పుడనేది మార్చి 14వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రకటిస్తామని చిత్రబృందం ప్రెస్ నోట్ విడుదల చేసింది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ కు  అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ తో ఆర్ మహేంద్రన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కూడా. కమల్ హాసన్, విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్  … ఈ ముగ్గురు పవర్ హౌస్ పెర్ఫార్మర్లను విక్రమ్ కోసం లోకేష్ కనగరాజ్ ఒకచోట చేర్చగలిగారు. స్టార్ తారాగణంతో పాటు, ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరేన్, శివాని నారాయణన్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్