Friday, March 29, 2024
HomeTrending Newsపోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

పోలాండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

Special Team:  ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. దీనికోసం వెంటనే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగేరీ లకు ప్రభుత్వం తరఫుల ప్రత్యేక అధికారులను పంపాలని నిర్ణయించింది.

ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు,  విద్యార్ధుల తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  వెంటనే రాష్ట్రం నుంచి ప్రతినిధులను పంపాలని ఆదేశించారు. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్ధుల వివరాలను భారత విదేశంగా శాఖకు పంపామని అధికారులు సిఎం కు వివరించారు. అందరినీ వీలైనంత త్వరగా వెనక్కు తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని సిఎం జగన్ సూచించారు.

Also Read : ఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్