Appalaraju- IT: సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తన పరిధిలో ఉన్న వివిధ శాఖల భాధ్యతలను పలువురు మంత్రులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. అలాగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖలను…. రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి డా. సీదిరి అప్పలరాజు కు ఆప్పగించారు,
సిఎం జగన్ వద్దనున్న శాంతి భద్రతలు- హోం మంత్రి మేకతోటి సుచరిత; సాధారణ పరిపాలన శాఖ – కురసాల కన్నబాబు; న్యాయ శాఖ – ఆదిమూలపు సురేష్; ఎన్నారై వ్యవహారాలు-పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్-బుగ్గన రాజేంద్ర నాథ్; సినిమాటోగ్రఫీ – పేర్ని నానిలకు అప్పగించారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రశ్నలు, ఏవైనా బిల్లులకు సంబంధించిన వివరాలను సిఎం తరఫున ఆయా మంత్రులు సభకు వివరిస్తారు.