Sunday, June 14, 2026
HomeTrending Newsఅగ్నివీర్ కు దరఖాస్తుల ఆహ్వానం

అగ్నివీర్ కు దరఖాస్తుల ఆహ్వానం

భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెళ్లికాని పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24కు సంబంధించి గురువారం (ఫిబ్రవరి 16) నుంచి అగ్నిపథ్‌ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  రేపటి వరకు అవకాశం ఉండటంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత అగ్నివీర్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు.

దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుదిగడువు. అనంతరం ఏప్రిల్‌ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు.అభ్యర్థులు www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular