Friday, March 6, 2026
HomeTrending NewsVRA: హైదరాబాద్ జిల్లాలో వీఆర్‌ఏలకు నియామక పత్రాలు

VRA: హైదరాబాద్ జిల్లాలో వీఆర్‌ఏలకు నియామక పత్రాలు

గ్రామ సేవకులుగా ఉన్న VRA లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపును ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో హోంమంత్రి మహామూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలో వివిధ శాఖలకు కేటాయించబడిన 66 మంది VRA లకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి గ్రామ సేవకులుగా సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని VRA లు అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నియామక ప్రత్రాలు అందించినట్టు వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో వారి వారి విద్యార్హతల ఆధారంగా వీరిని జూనియర్ అసిస్టెంట్, హెల్పర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ తదితర కేటగిరీలలో నియమించడం జరిగిందని వివరించారు. హైదరాబాద్ జిల్లాకు 182 ని కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. వీరిలో 40 మంది హైదరాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా, 26 మంది మెదక్, 62 మంది కామారెడ్డి, 17 మంది జనగాం, 37 మంది మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల కు చెందిన VRA లు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, MLC లు సురభి వాణి దేవి, ప్రభాకర్ రావు, రహ్మత్ బేగ్, MLA లు దానం నాగేందర్, మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, ముంతాజ్ ఖాన్, కలెక్టరేట్ AO సునీల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular