Tuesday, February 25, 2025
HomeTrending NewsEducation: ద్విభాషా పుస్తకాలు భేష్: ధర్మేంద్ర ప్రధాన్

Education: ద్విభాషా పుస్తకాలు భేష్: ధర్మేంద్ర ప్రధాన్

ఏపీలో ప్రవేశ పెట్టిన పాఠ్య పుస్తకాల తీరును కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందించారు.  విద్యార్థులకు అర్థయ్యేలా తీసుకువచ్చిన ద్విభాషా పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయని, దీన్నిప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారని తెలియజేశారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడారు.  ఓ వైపున ఏపీ మాత్రు భాష తెలుగు, మరోవైపున ఇంగ్లీష్ భాషతో కంటెంట్ ను రూపొందించి ఓ సరికొత్త విధానం తీసుకొచ్చారని అన్నారు.

కేంద్రం 800 కోట్ల పెట్టుబడితో ట్రైబల్ యూనివర్సిటీ కడుతోందని, దానికి దాదాపు 570 ఎకరాల భూమితో పాటూ రోడ్లు, కరెంట్, నీరు లాంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర  ప్రభుత్వం అందించిందని వెల్లడించారు.  ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రెండు వేల కోట్ల రూపాయలు అని తెలిపారు. రాబోయే కాలంలో ఇక్కడో వెంకటేశ్వర స్వామి గుడి కూడా కడతామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్