Sunday, January 19, 2025
HomeTrending Newsఅక్వా రంగంలో మనమే టాప్: విజయసాయి

అక్వా రంగంలో మనమే టాప్: విజయసాయి

Aquaculture: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో  ఆక్వా రంగం విశేషంగా అభివృద్ధి చెందిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. గత చంద్రబాబు హయాంలో ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, కానీ జగన్ ఓ క్రమ పద్ధతిలో ఆక్వా రంగానికి చేయూత నిస్తూ ప్రోత్సహించారని విజయసాయి ప్రసంశించారు. ఈ మేరకు అయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

“చంద్రబాబు హయాంలో అంపశయ్యపై ఉన్న ఆక్వా రంగానికి జగన్ గారి ప్రభుత్వం ఊపిరిపోసింది. ఇప్పుడు దేశ మత్స్య సంపదలో31% ఏపీ నుంచే. 6 నెలల్లో19 వేల కోట్ల విలువైన18.46 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి. కరెంటు సబ్సిడీ, ఆక్వాకల్చర్‌ సీడ్‌ యాక్ట్, ఫిష్‌ ఫీడ్‌ యాక్టుతో ఆక్వాకు కొత్త ఉత్తేజం” అంటూ ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్