Thursday, March 28, 2024
Homeసినిమా‘మాచర్ల నియోజకవర్గం’ భారీ షెడ్యూల్‌ పూర్తి

‘మాచర్ల నియోజకవర్గం’ భారీ షెడ్యూల్‌ పూర్తి

Action in Macherla:  ప్రస్తుతం హీరో నితిన్  తన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ ఎడిటర్ MS రాజశేఖర్ రెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.

నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, అనల్ అరసు మాస్టర్  కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. జానీ మాస్టర్ సాంగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి అన్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్‌ తో ఇద్దరు కథానాయికల కలయిక ఇదే తొలిసారి. పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో  పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వరసాగర్  మూడవసారి నితిన్‌ తో కలిసి పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్