Saturday, March 14, 2026
Homeసినిమాఏఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం

ఏఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం

New Production house with New stars: ఏ సురేష్ ప్రభు సమర్పణలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై విజయ్, శీతల్ బట్ హీరో హీరోయిన్లు (నూతన పరిచయం) గా సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏ.ఆర్ రాకేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని హీరోహీరోయిన్స్ పై ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా.. నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు.

రాకేష్ మాట్లాడుతూ  “సినిమారంగంపై ప్రేమతో చాలారోజుల నుండి సినిమా తీయాలనే ఆలోచనతో ఉండగా సురేష్ ప్రభు చెప్పిన కథల్లో ఈ సినిమా లైన్ వినిగానే చాలా కొత్తగా డిఫరెంట్ గా వుందని పించింది. అందుకే ఈ కథని సినిమాగా తీయాలని అనుకున్నాను.ఇదే నా మొదటి చిత్రమైనా నిర్మాణ విలువలకు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం” అన్నారు.

దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ “నిర్మాత రాకేష్ గారికి కథ చెప్పిన వెంటనే కొత్తగా ఉంది. మనం ఈ సినిమా చేస్తున్నాం అని  చెప్పారు  అందుకు ముందుగా ఆయనకు నా కృతజ్ఞతలు. ఇకపోతే ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉత్కంఠభరితంగా వెళ్లే సస్పెన్స్ థ్రిల్లర్. ఈరోజు నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుపు కుంటున్నాము. ఈ చిత్రం ద్వారా విజయ్, శీతల్ బట్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం” అన్నారు

చిత్రం శ్రీను మాట్లాడుతూ “దర్శకుడు సురేష్ ప్రభు గత 13 సంవత్సరాలుగా నాకు తెలుసు  తనకు సినిమా అంటే ఎంతో ప్యాషన్. తనకు నిర్మాత రాకేష్ గారు దొరకడం, అలాగే సీనియర్ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా లభించడంతో సినిమాకు అద్భుతమైన రూపం వచ్చింది. ఇందులో నేను మంచి పాత్ర చేస్తున్నాను. నిర్మాణ బాధ్యతలు నామీద పెట్టారు. నా శక్తి వంచనలేకుండా సహకరిస్తాను. ఈ సినిమా మా అందరికీ పెద్ద విజయం ఇవ్వాలని కోరుతున్నాను” అన్నారు.

హీరో విజయ్ మాట్లాడుతూ “ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular