Wednesday, May 29, 2024
Homeసినిమామా కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ డిసెంబర్ 24న తెలుస్తుంది : నాని

మా కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ డిసెంబర్ 24న తెలుస్తుంది : నాని

Christmas is ours: నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. ‘అనురాగ్ అద్భుతంగా పాట పాడారు. ఇలా లైవ్‌లో ఎన్నో సార్లు చూశాను. కానీ ఈరోజు మాత్రం ఏదో అద్భుతమని అనిపించింది. సిరివెన్నెల గారి ఆశీస్సులున్నాయ్ కాబట్టే అలా అనిపించిందేమో. ఎప్పుడూ వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్ వేసుకునే వస్తాడని అందరూ అంటుంటారు. అందుకే మా ఆవిడ ఓ పది బ్లేజర్‌లు కొనేసింది. మనం ఏం పీకామని అని నేను వేసుకోలేదు. బాగా దుమ్ముపట్టి పోయాయ్. కానీ శ్యామ్ సింగ రాయ్ సినిమా చూశాక వేసుకోవాలని అనిపించింది. ఇంతకు మించి సినిమా గురించి రిపీట్ చేసి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మా టీం అందరి కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ డిసెంబర్ 24న మీకు తెలుస్తుంది. మీ కళ్లలో కూడా 24న కనిపిస్తుంది.

చాలా మంచి సినిమాను చేసి, మేం చూశాక.. ఆడియెన్స్‌ కు చూపించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండకూడదని ఈ సినిమాతోనే తెలిసింది. ఈ సినిమాను ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురు చూస్తున్నాను. మిక్కీ జే మేయర్, సాను వర్గీజ్ పనితనం ఎంత గొప్పగా ఉంటుందో డిసెంబర్ 24న తెలుస్తుంది. సాయి పల్లవి ఎందుకంత ఎమోషనల్ అయిందో ఆ రోజునే తెలుస్తుంది. సాయి పల్లవి, కృతి శెట్టిలు అద్భుతంగా నటించారు. రాహుల్‌ని నేను ఇప్పుడు ఎంత పొగిడినా సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. రాహుల్ సైడ్ నుంచి పెద్ద సర్ ప్రైజ్ ఉండబోతోంది. మిక్కీ అద్భుతమైన సంగీతమిచ్చాడు.

వెంకట్ గారికి ఇది మొదటి సినిమా. ఇలాంటి చిత్రం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వెంకట్ గారు ఇంతకాలం పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కుతుంది. మడోన్నా చేసిన రోల్ ఎంతో కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. అంత త్వరగా ఏ నటి కూడా అంగీకరించరు. ఈ సినిమా తరువాత మడోన్నాకు మంచి పేరు వస్తుంది. మనీష్ గారు ఫైట్స్ విషయంలో చాలా కష్టపడ్డారు. డిసెంబర్ 24న రాబోతోన్నాం. క్రిస్మస్ మాత్రం మనదే అని అన్నారు .

Also Read : ‘శ్యామ్ సింగ రాయ్’ కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ – మిక్కీ జే మేయర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్