Wednesday, June 26, 2024
Homeసినిమాసెంటిమెంట్ క‌లిసొస్తుందా?

సెంటిమెంట్ క‌లిసొస్తుందా?

2nd villain: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రాజ‌మండ్రి స‌మీపంలో షూటింగ్ జ‌రుపుకుంది. చ‌ర‌ణ్ మ‌రియు కొంత మంది ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో చ‌ర‌ణ్‌, శ్రీకాంత్ ల పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఇప్పటికే ఈ సినిమాలో ఒక విలన్ గా హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇప్పుడు మరో విలన్ కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నాడట‌. ఇంత‌కీ ఎవ‌రంటారా..? అరవింద్ స్వామి. ఆయ‌న ఈ సినిమాలో మెయిన్ విల‌న్ గా న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. అరవింద్ స్వామి ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తాడని స‌మాచారం.

ఈ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. అసలు ఇతను అరవింద్ స్వామినా? అనేలా ఆయన పాత్ర ఉంటుందట. మరి ఈ పాత్ర ద్వారా అరవింద్ స్వామి ఎలా మెప్పిస్తారో చూడాలి. గ‌తంలో చ‌ర‌ణ్ న‌టించిన ధృవ సినిమాలో అర‌వింద స్వామి విల‌న్ గా న‌టించారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. మ‌రి.. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా క‌లిసొస్తుందేమో చూడాలి.

Also Read : ‘లైగర్’తో ప్రియా ప్ర‌కాష్ స్పెష‌ల్ సాంగ్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్