Monday, June 17, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై భారత్ విజయం

మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై భారత్ విజయం

India in race:  ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో ఇండియా సెమీస్ రేసులో నిలబడింది.  టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై  110 పరుగులతో ఘనవిజయం సాధించింది. యస్తికా భాటియా అర్ధ సెంచరీ చేయగా, స్నేహ్ రానా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది.

హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ మైదానంలో జరిగిన  మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 74 పరుగులు చేసింది. ఓపెనర్  స్మృతి మందానా 30 పరుగులు చేసి అవుట్ కాగా, మరుసటి ఓవర్లో అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ షఫాలీ వర్మ (42) కూడా వెనుదిరిగింది. కెప్టెన్ మిథాలీ మరోసారి నిరాశ పరిచి డకౌట్ అయ్యింది. హార్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. యస్తికా భాటియా – రిచా ఘోష్ లు ఐదో వికెట్ కు 54 పరుగులు జోడించారు. రిచా 26, భాటియా 50 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో  స్నెహ్ రానా – పూజా వస్త్రాకర్ లు ఏడో వికెట్ కు 48 పరుగులు జోడించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. రానా 27 పరుగులు చేయగా, పూజా 30తో అజేయంగా నిలిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 229పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ 12 పరుగులకు  తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కూడా వరుస వికెట్లు కోల్పోయింది. జట్టులో సల్మా ఖాతున్- 32; లతా మొండల్-24; ముర్షీదా ఖాతున్-19; రితూ మోనీ-16 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రానా నాలుగు; గోస్వామి-పూజా వస్త్రాకర్ చెరో రెండు; పూనమ్ యాదవ్- రాజేశ్వరి గైక్వాడ్ చెరో వికెట్ పడగొట్టారు.

అర్ధ సెంచరీతో రాణించిన యస్తికా భాటియాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’  పొందడం ఆనందంగా ఉందని భాటియా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: మహిళల వరల్డ్ కప్: ఆసీస్ జైత్రయాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్